తిరుపతి: జిల్లా కేంద్రంలో సాయి నగర్లో నూతనంగా ఏర్పాటు చేసిన ఫ్రెండ్లీ వైన్ షాప్ విషయమై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ మాట్లాడారు.. వేరే వైన్ షాప్ వారు కమ్యూనిస్టులకు డబ్బులు ఇచ్చి ఉద్యమాన్ని నడుపుతున్నారు అనే అబద్ధపు సమాచారాన్ని ఎక్సైజ్ అధికారులు జిల్లా కలెక్టర్కు అందించడాన్ని ఖండించారు. 12వ తేదీ నుంచి బ్రాందీ షాపు ఎత్తేసేంతవరకు నిరసన దీక్షలో పాల్గొంటరన్నారు.