BPT: శ్రీరామనవమి సందర్భంగా బాపట్ల రథం బజార్లో శ్రీసీతారామ స్వామి కళ్యాణ మండపం వద్ద ఆదివారం మహిళా భక్తులకు పోలీస్ శాఖ వినూత్న కార్యక్రమాన్ని చేపట్టింది. ప్రతి ఒక్క మహిళా భక్తురాలి మొబైల్లో ‘శక్తి యాప్’ను ఇన్స్టాల్ చేస్తూ, మహిళల రక్షణ కోసం ఈ యాప్ ఎలా ఉపయోగపడుతుందో వివరించారు. ప్రతి ఒక్క మహిళకు రాముని బాణంలా శక్తి యాప్ పనిచేస్తుందన్నారు.