CM Jagan: ఒకరు వెన్నుపోటు వీరుడు.. మరొకరు ప్యాకేజీ సూరుడు: సీఎం జగన్
చిత్తూరులో అమూల్ డెయిరీ భూమి పూజ సందర్భంగా సీఎం జగన్ బహిరంగ సభలో ప్రసంగించారు. అలాగే వెల్లూర్ సీఎంసీకి పునాది రాయి వేయడం ఆనందంగా ఉందన్నారు. చంద్రబాబు హయాంలో కుట్రపూరిత కార్యక్రమాలు జరిగాయన్నారు.
తన ప్రత్యర్థులపై సీఎం జగన్(CM Jagan) మరోసారి నిప్పులు చెరిగారు. ఏపీ(AP)లో ఒక నాయకుడు వెన్నుపోటు వీరుడని, మరొకరు ప్యాకేజీ సూర్యుడని అన్నారు. టీడీపీ(TDP) అధ్యక్షుడు చంద్రబాబు(Chandrababu), జనసేన అధినేత పవన్(Pawan kalyan)ను ఉద్దేశిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. చిత్తూరు జిల్లాలో అమూల్ ప్రాజెక్ట్‌కు సీఎం జగన్ భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా పోలీస్ పరేడ్ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. టీడీపీ, జనసేన(Janasena) నాయకులపై విరుచుకుపడ్డారు. 75 ఏళ్ల ముసలి వ్యక్తి చంద్రబాబు అని, ఆయన రాజకీయ జీవితం ముసిపోతోందన్నారు. ఈ వయసులో కుప్పంలో ఇళ్లు కట్టుకోవడం ఆశ్చర్యంగా ఉందని, 35 ఏళ్ల తర్వాత అక్కడ ఇల్లు కట్టుకోవడం ఏంటని ప్రశ్నించారు. కుప్పంలో వైసీపీ సర్కారు పేదలకు ఇళ్లు కట్టిస్తోందన్నారు.
తన రాజకీయ జీవితంలో 1995 నుంచి కూడా చంద్రబాబు(Chandrababu) చిత్తూరు ప్రజలకు ఏం చేశారని సీఎం జగన్(Cm Jagan) ప్రశ్నించారు. 2004 వరకూ కూడా ఆయన బీజేపీ(BJP) భజనలు చేస్తూనే ఉన్నారన్నారు. తన సొంత మనుషులు దేవేందర్ గౌడ్, నామా వంటివారికి రాష్ట్రంలోని డెయిరీ(Dairy)లు అమ్మి ముడుపులు తీసుకున్నాడని విమర్శించారు.
ప్రజల చల్లని దీవెనలతోనే నేడు చిత్తూరు నుంచి 2 మంచి కార్యక్రమాలు చేపడుతుండటం ఆనందంగా ఉందన్నారు. ఎప్పుడో మూతబడిన చిత్తూరు డెయిరీ(Chittoor Dairy)ని తెరిపించడం, వెల్లూర్ సీఎంసీ, వెల్లూర్ మెడికల్ కాలేజీకి పునాది రాయి వేస్తుండటం సంతోషంగా ఉందన్నారు. చిత్తూరు డెయిరీని 2022లో కుట్ర పూరితంగా మూసివేశారని అన్నారు. నేడు దానిని పునఃప్రారంభించడం ఎంతో గొప్ప విషయమన్నారు.