CM Jagan: విద్యార్థులకు తమ ప్రభుత్వం అండగా ఉంటుందని సీఎం జగన్ (CM Jagan) అన్నారు. పదో తరగతిలో రాష్ట్రంలో ఫస్ట్ ర్యాంక్ సాధించిన విద్యార్థికి రూ.లక్ష నగదు పురస్కారం అందజేశారు. సెకండ్ ర్యాంక్ విద్యార్థికి రూ.75 వేలు, థర్డ్ ర్యాంక్ విద్యార్థికి రూ.50 వేల నగదు పురస్కారం అందజేశారు. సర్కార్ బడుల్లో చదువుతున్న పేదలకు ప్రపంచాన్ని ఏలే రోజు వస్తోందని జగన్ తెలిపారు. అంతర్జాతీయ స్థాయిలో పరీక్షా ప్రశ్నాపత్రాలు రూపొందిస్తామని తెలిపారు. జగనన్న ఆణిముత్యాల పేరుతో ఈ నెల 12 నుంచి 19 వరకు సత్కారాలు చేస్తారు.
ప్రభుత్వ బడుల్లో సదుపాయాలు, కరిక్యూలమ్ మారాయని సీఎం జగన్ (CM Jagan) వివరించారు. ప్రతీ విద్యార్థికి ట్యాబ్ అందజేస్తామని తెలిపారు. ఇక్కడ కూడా ఇంగ్లిష్ మీడియాం, సీబీఎస్సీ సిలబస్ అందుబాటులో ఉందన్నారు. తర్వాత విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ (botsa satyanarayana) మాట్లాడారు. విద్యార్థుల్లో పోటీ తత్వం పెరగాలని, ఏ రాష్ట్రం వెళ్లినా పోటీలో నిలబడాలని కోరారు.
ఇంగ్లీష్ మీడియం, డిజిటిల్ విద్య ప్రవేశపెట్టి, మెరుగైన విద్యను ఏపీ సర్కార్ అందజేస్తోంది. ప్రతీ పేద కుటుంబం నుంచి ఓ డాక్టర్, ఇంజినీర్, కలెక్టర్, సైంటిస్ట్, వ్యాపార వేత్త, లీడర్ రావాలని తమ ప్రభుత్వం పనిచేస్తోందని సీఎం జగన్ (CM Jagan) అభిలాషించారు. నాలుగేళ్లలో విద్యారంగ సంస్కరణల కోసం రూ.60 వేల కోట్లు ఖర్చు చేశామని వివరించారు.