CM Jagan: ఎమ్మెల్యేలకు సీఎం జగన్ సీరియస్ వార్నింగ్
సీఎం జగన్ ఎమ్మెల్యేలతో కీలక సమావేశం నిర్వహించారు. పార్టీలో 20 మంది ఎమ్మెల్యేల పనితీరు బాలేదని, వచ్చే ఎన్నికల్లో పనితీరు బాగున్న వారికే టికెట్ కేటాయిస్తానని స్పష్టం చేశారు. వచ్చే 9 నెలలు అత్యంత కీలకమని, అందరూ ప్రజా సమస్యల పరిష్కారానికి పాటుపడాలని తెలిపారు. తీరు మార్చుకోని ఎమ్మెల్యేలను పార్టీ నుంచి తొలగిస్తామని హెచ్చరించారు.
ఏపీ ఎమ్మెల్యేల(Ap MLA’s)కు సీఎం జగన్(Cm Jagan) సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. పనితీరు బాగుండే ఎమ్మెల్యేలకు మాత్రమే టికెట్లు ఇస్తానని, మిగిలినవారికి సీట్లు ఇవ్వలేనని ఆయన స్పష్టం చేశారు. బుధవారం సీఎం జగన్ ఎమ్మెల్యేల మీటింగ్లో కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రతి ఎమ్మెల్యే గ్రాఫ్ పెంచుకోవాలని సూచించారు. గ్రాఫ్ పెంచుకోలేని వారిని పార్టీలో కొనసాగించలేమని తేల్చి చెప్పారు. ‘గడపగడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమం వల్ల ప్రతి ఎమ్మెల్యేకు గ్రాఫ్ పెరుగుతుందన్నారు.
సర్వేల్లో అనుకూలంగా లేనివారిని కూడా పార్టీ(YRSCP)లో కొనసాగించడం కుదరదని హెచ్చరిక చేశారు. అలాంటి వారికి టికెట్లు ఇవ్వడం వల్ల వారికే కాకుండా పార్టీకి కూడా తీవ్రంగా నష్టమని సీఎం జగన్(CM Jagan) తెలిపారు. ‘గడపగడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమంపై, ‘జగనన్న సురక్ష’పై చర్చలు జరిపారు. రాబోయే 9 నెలలు అత్యంత కీలకమని, జగనన్న సురక్షలో భాగంగా ప్రతి ఇంటికి వెళ్లి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని సూచించారు.
ప్రజలకు ఏయే పథకాలు అందాలి, ఏవి అందండం లేదో తెలుసుకుని ప్రజా సమస్యల పట్ల సానుకూలంగా స్పందించాలన్నారు. మరో సమావేశంలోగా పనితీరును మెరుగుపర్చుకోవాలని సూచించారు. పార్టీలో 15 నుంచి 20 మంది ఎమ్మెల్యేల(Ap MLA’s) పనితీరు అస్సలు బాలేదని, వారిని పిలిచి స్వయంగా మాట్లాడుతానని అన్నారు. అందరూ కష్టపడి ఏపీలో 175కి 175 సీట్లను గెలుచుకుందాని సీఎం జగన్(CM Jagan) అన్నారు.