KRNL: ఆదోని మండలంలోని గోనుబావి, ఉంగునూరు గ్రామాల్లో బుధవారం సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ సంక్షేమ పథకాల వివరాలు ప్రజలకు అందించారు. కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ కురువ కార్పొరేషన్ చైర్మన్ మాన్వి దేవేంద్రప్ప, తెలుగుదేశం పార్టీ ఇంచార్జీ మీనాక్షి నాయుడు, మాజీ చైర్మన్లు, కౌన్సిలర్లు, టీడీపీ నాయకులు, పాల్గొన్నారు.