W.G: వరద ప్రభావిత లంక గ్రామాల్లో శనివారం మంత్రి నిమ్మల పర్యటించారు. కనకాయలంకలో నీటిలో నడుస్తూ ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. వరద సమయంలో కనకాయలంకలో కాజ్ వే ముంపుతో రాకపోకలు నిలిచిపోతాయని స్థానికులు మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. ఈ క్రమంలో మంత్రి స్పందిస్తూ శాశ్వత పరిష్కారం కోసం రూ.23 కోట్లతో వంతెన మంజూరుకు హామినిచ్చారు.