విజయవాడ వన్ టౌన్లో విషాదం చోటుచేసుకుంది. బంగారు వ్యాపారి సాయి ప్రకాష్ రెడ్డి అప్పుల భారంతో తన ఏడేళ్ల కుమారుడు దీక్షిత్ రెడ్డికి ఐస్క్రీమ్లో సైనైడ్ ఇచ్చి చంపి, తానూ సైనైడ్ సేవించి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గురువారం రాత్రి ఆసుపత్రి చేర్చారు. కాగా ఇద్దరు చికిత్స పొందుతూ ఈ రోజు ఉదయం మృతి చెందారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు.