ప్రకాశం: గనుల శాఖ ద్వారా ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయంపై నిరంతర పర్యవేక్షణ అవసరమని ప్రకాశం కలెక్టర్ పి. రాజాబాబు చెప్పారు. ఒంగోలు ప్రకాశం భవనంలోని తన ఛాంబర్లో గనులు, ఏపీ ఎండీసీ, పర్యావరణ కాలుష్యం నియంత్రణ మండలి, రవాణా, ఆర్టీసీ ఉన్నతాధికారులతో ఆయన ప్రత్యేకంగా బుధవారం సమీక్షించారు. జిల్లాలోని గనుల విస్తీర్ణం, వాటి రకాలు, లభిస్తున్న ఉపాధి, రవాణా,ఆరా తీశారు.