కృష్ణా: విజయవాడ కలెక్టరేట్లో కలెక్టర్ లక్ష్మీశ గురువారం ధాన్యం కొనుగోళ్లపై వివిధ శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఇప్పటి వరకు సేకరించిన ధాన్యం, రైతుల ఖాతాల్లో జమచేసిన సొమ్ము, గోనె సంచుల అందుబాటు, మిల్లులకు ధాన్యం రవాణా, వర్షాల నేపథ్యంలో తీసుకున్న ప్రత్యేక చర్యలు తదితరాలపై చర్చించారు.