NTR: సంక్రాంతి పండుగకు తిరువూరు నియోజకవర్గంలో ఎలాంటి జూదాలకు ఇతర అసాంఘిక కార్యక్రమాలకు అనుమతులు ఉండవని ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు ముందుగా హెచ్చరించారు. ఎవరైనా ఆ ఏర్పాట్లు చేసినట్లయితే భవిష్యత్ పరిణామాలకు వారే బాధ్యులని సోషల్ మీడియా మాధ్యమం ద్వారా హెచ్చరించారు. కాగా, అసాంఘిక కార్యక్రమాలు నిర్వహించే ప్రసక్తే లేదని పేర్కొన్నారు.