ATP: గార్లదిన్నె మండలం కృష్ణాపురంలో వినూత్న రీతిలో దొంగతనం జరిగింది. నగలకు మెరుగు పెడతామని వచ్చిన ఇద్దరు యువకులు సుగుణమ్మ అనే మహిళను నమ్మించారు. అనంతరం నాలుగు తులాల తాళిబొట్టు చైన్ దోచుకుని ద్విచక్ర వాహనంపై పరారయ్యారు. ఫిర్యాదు అందుకున్న ఎస్సై గౌస్ మహమ్మద్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.