VSP: ముత్యాలమ్మ పాలెం గ్రామంలో గ్రామ సర్పంచ్ చింతకాయల సుజాత సౌజన్యంతో క్రికెట్ టోర్నమెంట్ను మత్స్యకార సంఘం నాయకుడు ముత్యాలు సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సర్పంచ్ తన సొంత నిధులతో క్రీడా మైదానాన్ని అభివృద్ధి చేశారన్నారు. అలాగే క్రీడాకారులకు క్రికెట్ కిట్ కూడా అందజేశారని అన్నారు. యువత క్రీడల పట్ల ఆసక్తి చూపించాలన్నారు.