ప్రకాశం: ఒంగోలు నగరంలోని ఏకేవీకే జూనియర్ కళాశాలలో గత కొన్ని రోజులుగా నిర్వహిస్తున్న ఇంటర్ స్పాట్ వాల్యూయేషన్ ప్రక్రియ ముగిసింది. మార్కుల మొత్తం జాబితాను తయారు చేసి కంప్యూటరీకరణ కూడా పూర్తయినట్లుగా అధికారులు తెలిపారు. కాగా, ఎక్కడైనా లోపాలు ఉన్నాయా అనేవి చూసి తప్పులు ఉంటే వాటిని సరిచేస్తున్నామని తెలిపారు.