ELR: ద్వారకాతిరుమల మండలం జీ.కొత్తపల్లిలో కోడిపందాలపై ద్వారకాతిరుమల పోలీసులు ఆదివారం దాడి చేశారు. 17 మందిని అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి రూ.31.600 నగదు, 17 బైకులు, ఒక కోడిపుంజును స్వాధీనం చేసుకున్నారు. ద్వారకాతిరుమల ఎస్సై టీ.సుధీర్ మాట్లాడుతూ.. గ్రామాలలో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.