CTR: పుంగనూరు పట్టణం పాత బస్టాండ్ సమీపాన గల శ్రీ విరుపాక్షి మారమ్మ మంగళవారం విశేష పూజలు అందుకున్నారు. ఉదయమే అర్చకులు అమ్మవారి మూల విగ్రహాన్ని క్షీరాలతోపాటు సుగంధ ద్రవ్యాలతో అభిషేకించారు. తర్వాత కుంకుమ, పసుపు, గంధం, కాటుక, వెండి ఆభరణాలతో అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించారు. ఆలయానికి విచ్చేసిన భక్తులు మారెమ్మను దర్శించుకుని పూజలు చేశారు.