KRNL: ఎమ్మిగనూరులో ‘స్వర్ణాంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర’ కార్యక్రమంలో భాగంగా శనివారం ర్యాలీ నిర్వహించారు. పురపాలక కమిషనర్ ఎన్. గంగిరెడ్డి ఆధ్వర్యంలో మున్సిపల్, సచివాలయ, మెప్మా సిబ్బంది పాల్గొన్నారు. మున్సిపల్ కార్యాలయం నుంచి సోమప్ప సర్కిల్ మీదుగా గాంధీ సర్కిల్ వరకు ర్యాలీ చేపట్టారు.