కృష్ణా: వైసీపీ మచిలీపట్నంలో నేడు తలపెట్టిన ‘ఛలో మెడికల్ కాలేజ్’ నిరసన కార్యక్రమానికి ఎటువంటి అనుమతి లేదని డీఎస్పీ సీహెచ్ రాజా తెలిపారు. పోలీస్ యాక్ట్-30 అమలులో ఉన్నందున నిరసనలకు అనుమతి ఇవ్వలేమని అన్నారు. ఈ కార్యక్రమం వల్ల విద్యార్థుల దినచర్యకు ఆటంకం ఏర్పడే అవకాశం ఉన్నందున అనుమతి నిరాకరించినట్లు డీఎస్పీ వివరించారు.