తెలుగుదేశం (Telugudesam) జగనాసుర రక్త చరిత్ర బహిరంగం అనే పుస్తకాన్ని శుక్రవారం విడుదల చేసింది. అచ్చెన్నాయుడు, వర్ల రామయ్య, ఆనంద బాబు,. బుచ్చయ్య చౌదరి, రామానాయుడు, బోండా ఉమ, అనురాధ తదితరులు ఈ పుస్తకాన్ని విడుదల చేశారు. ఈ పుస్తకం ద్వారా జగన్ పైన ప్రశ్నల వర్షం కురిపించారు.
– జగన్ రెడ్డి (ys jagan) నరహంతక పాలనకు చరమగీతం పాడుదాం… ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుందాం అని ఆ బుక్ లో పేర్కొన్నారు.
– తన బాబాయి వైయస్ వివేకానంద రెడ్డి మర్డర్ కేసులో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సీబీఐ దర్యాప్తు కోసం కోర్టులో పిటిషన్ వేసిన జగన్.. అధికారంలోకి వచ్చాక దానిని ఎందుకు ఉపసంహరించుకున్నారో చెప్పాలి.
– వివేకా హత్య కేసులో నిందితుడు శివశంకర్ రెడ్డిని పార్టీ నుండి ఎందుకు బహిష్కరించలేదు. అతనిని కోర్టు అనుమతి లేకుండా రిమ్స్ కు ఎందుకు తరలించారు.
– వివేకా హత్య అనంతరం వేకువజామున మూడు గంటలకు భారతి పీఏ నవీన్.. ఎంపీ అవినాష్ రెడ్డికి ఎందుకు ఫోన్ చేశారు?
– సీబీఐ ఛార్జిషీట్, వైయస్ కుమార్తెతో పాటు, కుటుంబ సభ్యులు, అప్రూవర్ దస్తగిరి వాంగ్మూలంను బట్టి.. ఆధారాలు తాడేపల్లి ప్యాలెస్ ప్రమేయాన్ని వెల్లడిస్తున్నాయి.
– కీలక వ్యక్తులు పైన అనేక ఆరోపణలు ఉన్నప్పటికీ ఎందుకు అరెస్ట్ చేయడం లేదు.
– వివేకా హత్య దర్యాప్తు ప్రారంభంలో సిట్ కు అధిపతిగా అదనపు డీజీపీ స్థాయి అధికారి ఉండగా… ఆ తర్వాత ఎస్పీ స్థాయి అధికారిని ఎందుకు నియమించారు?
– అవినాష్ రెడ్డి అనుచరుడు ఉదయ్ కుమార్ రెడ్డిని విచారణకు తీసుకెళ్తూ ఉండగా.. సిట్ అధికారికి ఫోన్ వెళ్లిందా లేదా? ఉదయ్ ని తిరిగి పంపించింది నిజం కాదా?
– జగన్ సీఎం అయిన నెలలో గంగిరెడ్డికి బెయిల్ ఎలా వచ్చింది? అతని పైన ఛార్జిషీట్ ఎందుకు వేయలేదు?
– సీఐ శంకరయ్య తొలుత మేజిస్ట్రేట్ ముందు వాంగ్మూలం ఇచ్చేందుకు సిద్ధమై… ఆ తర్వాత ఎందుకు తగ్గారు? జగన్, భారతి మౌనం ఎందుకు పాటిస్తున్నారు?
– వివేకా హత్య రోజున ఓఎస్డీ ఫోన్ నుండి జగన్ పలుమార్లు అవినాష్ తో ఫోన్ మాట్లాడలేదా?
– కడప ఎంపీ టికెట్ కోసం శివశంకర్ రెడ్డి ద్వారా అవినాష్ చంపించారనే అనుమానం ఉందని సీబీఐ కోర్టు అఫిడవిట్ లో పేర్కొనలేదా?
– సీబీఐ అధికారి పైన రాష్ట్ర పోలీసులు కేసు నమోదు చేయడం వెనుక ఎవరు ఉన్నారు?
– శివశంకర్ రెడ్డి, గంగిరెడ్డి తరపున వాదిస్తున్న న్యాయవాదులకు కోట్లాది రూపాయలు ఎవరు ఇస్తున్నారు?
– హత్యను గుండెపోటుగా విజయసాయితో చెప్పించారు.. అవినాష్ రెడ్డి, అతని తండ్రి భాస్కర్ రెడ్డి ద్వారా ఆధారాలు మాయం చేశారు.
– హత్య గురించి తెలుసు కూడా జగన్ సాయంత్రం వరకు ఎందుకు వెళ్లకుండా ఉన్నారు.
– సీఐ శంకర్ రెడ్డిని ఎందుకు బెదిరించారు?
– వివేకా అల్లుడు రాజశేఖర్ రెడ్డి, కూతురు సునీత రెడ్డి, షర్మిల చేసిన ఆరోపణలు, వాంగ్మూలం కూడా అందుకు అనుగుణంగా ఉందని పేర్కొన్నారు.