NLR: సోమశిల జలాశయం పూర్తి సామర్ధ్యం 78 టీఎంసీలు కాగా ప్రస్తుతం జలాశయంలో 70.650 టీఎంసీల నీటిమట్టం నమోదైంది. సోమవారం ఎగువ ప్రాంతాల నుంచి 4,361 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతున్నట్లు జలాశయ అధికారులు తెలిపారు. పెన్నా డెల్టాకు 2,250, ఉత్తరకాలువకు 700, కావలి కాలువకు 550, కండలేరుకు 2,500 క్యూసెక్కుల నీటిని విడుదల చేయడం జరుగుతుంది.