ATP: ప్రజల ఫిర్యాదుల పరిష్కారం కోసం 1100 కాల్ సెంటర్ సేవలను వినియోగించుకోవాలని ఇంఛార్జ్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మ సూచించారు. గతంలో సమర్పించిన అర్జీల స్థితిగతులు తెలుసుకోవడానికి లేదా కొత్త ఫిర్యాదుల నమోదుకు ఈ నంబర్ ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. ప్రజలు తమ సమస్యలను మీకోసం వెబ్సైట్ ద్వారా కూడా నమోదు చేయవచ్చని తెలిపారు.