కృష్ణా: కేంద్రమంత్రి అమిత్ షా అంబేద్కర్ పట్ల చేసిన అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ గుడివాడ సీపీఎం ఆధ్వర్యంలో సోమవారం నెహ్రూ చౌక్ సెంటర్లో నిరసన కార్యక్రమం చేపట్టారు. సీపీఎం గుడివాడ డివిజన్ కార్యదర్శి ఆర్సీపీ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో అమిత్ షాను మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలని, తన వ్యాఖ్యలను ఉపసంహరించుకొని క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.