VZM: కొత్తవలస మండల తహసీల్దార్ అప్పలరాజు ఆదేశాలతో సంతపాలెం ప్రభుత్వ భూమిలోని షెడ్‌ను సోమవారం కూల్చివేశారు. సర్వే నంబరు 25-2 ఓ వ్యక్తి ప్రభుత్వ భూమిని ఆక్రమించుకొని కబేలా నిర్వహిస్తున్నాడు. తహసీల్దార్ ఆదేశాలతో కూల్చివేసినట్లు వీఆర్వో రవీంద్ర తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ భూములు ఆక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.