NLR: వెంకటాచలం మండలం చవటపాలెం ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని తెలుగు రైతు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రావూరు రాధాకృష్ణమ నాయుడు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి రైతు ధాన్యాన్ని ఆరబెట్టి ప్రభుత్వానికి విక్రయించి, గిట్టుబాటు ధర పొందాలని సూచించారు.