ATP: వజ్రకరూరు మండల కేంద్రంలోని గ్రామాలలో మంగళవారం చేస్తున్న కరెంటోళ్ల జన బాట కార్యక్రమాన్ని CJM ఉమాపతి ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం గ్రామంలో ఇంటింటికీ వెళ్లి విద్యుత్ వినియోగదారుల ఇబ్బందులు తెలుసుకున్నారు. గ్రామాల్లో విద్యుత్ సమస్యలను గుర్తించి, వాటిని పరిష్కరించాలని సిబ్బందికి సూచించారు. ప్రజలకు మెరుగైన, నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయాలన్నారు.