ELR: వట్లూరులోని CR రెడ్డి ఇంజనీరింగ్ కాలేజీలో జులై 14న ఎంపీ మహేష్ కుమార్ ఆధ్వర్యంలో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ అధికారి జితేంద్రబాబు బుధవారం తెలిపారు. సుమారు 2,500 ఉద్యోగ ఖాళీలకు ఈ మేళా నిర్వహిస్తున్నామన్నారు. 18-35 ఏళ్లలోపు వారు అర్హులన్నారు. టెన్త్, ఇంటర్, ఐటీఐ, డిప్లమో, డిగ్రీ, ఫార్మసీ, ఎంబీఏ విద్యార్హతలని తెలిపారు.