విజయనగరం: హిందూ, ముస్లింల ఐక్యతకు, మత సామరస్యానికి ప్రతీకగా హజరత్ డెంఖేషావలి బాబా ఉరుసు ఉత్సవం నిలుస్తోందని మాజీ డిప్యూటీ స్పీకర్ కోళ్లగట్ల వీరభద్ర స్వామి, యువజన నాయకులు ఈశ్వర్ కౌశిక్ అన్నారు. కోట వద్ద ఉన్న డెంఖేషావలి బాబా వారి 309వ ఉరుసు ఉత్సవాల్లో వీరు పాల్గొన్నారు. అనంతరం బాబాకు చాదర్ సమర్పించారు. కులమతాలకు అతీతంగా ఉరుసు ఉత్సవం జరుపుకోవడం ఆనందంగా ఉందన్నారు.