అన్నమయ్య: పుట్టిన రోజు సరదాగా స్నేహితుడితో వెళ్లిన వారికి అదే చివరి రోజు అయింది. ఈ విషాద ఘటన పీటీఎం మండలంలో చోటు చేసుకుంది. అంబేడ్కర్ కాలనీకి చెందిన శ్రీనివాసులు(22) సోమవారం పుట్టినరోజు నాడు తన స్నేహితుడు చందు(22)తో బి.కొత్తకోటలో సినిమా చూడటానికి వెళ్లారు. ఇంటికి వస్తున్న క్రమంలో గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో ఇద్దరు మృతి చెందారు. దీంతో గ్రామంలో విషాద చాయలు అలుముకున్నాయి.