VZM: దత్తిరాజేరు మండలంలోని భూపాలరాజపురం గ్రామంలో సీతారాముల వారిని గజపతినగరం మాజీ శాసనసభ్యులు బొత్స అప్పల నరసయ్య ఆదివారం దర్శించుకున్నారు. నూతనంగా నిర్మించిన సీతారాముల ఆలయంలో అప్పలనరసయ్య ప్రత్యేక పూజలు జరిపించారు. అంతకుముందు నాయకులు కార్యకర్తలు అప్పల నరసయ్యకు ఘనస్వాగతం పలికారు.