ప్రకాశం: పుల్లలచెరువు మండలం మర్రివేములలో స్వర్గీయ ఉదారపు వెంకటేశ్వర్లు కాంస్య విగ్రహావిష్కరణ కార్యక్రమంలో ఎర్రగొండపాలెం నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ గూడూరి ఎరిక్షన్ బాబు, గుంటూరు జనసేన కో ఆర్డినేటర్ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎరిక్షన్ బాబు వెంకటేశ్వర్లు సేవలను కొనియాడారు. వారి ఆశయ సాధనకు కృషి చేయాలని కోరారు.