E.G: అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ABVP) ఆధ్వర్యంలో జాతీయ విద్యార్థి దినోత్సవం సందర్భంగా నిడదవోలు పట్టణంలో బుధవారం విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు భారత్ మాతాకు జై, ABVP జిందాబాద్ అంటూ నినాదాలు చేశారు. విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం ABVP రాజీలేని ఉద్యమాలు నిర్వహిస్తుందని పలువురు విద్యార్థులు పేర్కొన్నారు.