పశ్చిమ గోదావరి జిల్లా దివ్యాంగుల క్రీడా ఫెడరేషన్ సభ్యులకు ఈ నెల 18, 19 డిసెంబర్ 2024న తూర్పు గోదావరి జిల్లా కాకినాడలో జరుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర 3వ DEAF “T-20” క్రికెట్ టోర్నమెంట్ పోటీలకు హాజరుకానున్నారు. వారి ఖర్చుల నిమిత్తం తణుకు ఎమ్మెల్యే రాధాకృష్ణ ఆర్ధిక సహాయం క్రింద రూ. 24,000 అందించి, టోర్నమెంట్లో విజయం సాధించాలని ఆకాంక్షించారు.