ప్రకాశం: కంభం చెరువును ఏపీ టూరిజం కార్పొరేషన్ ఛైర్మన్ లోకసాని బాలాజీ శుక్రవారం సందర్శించారు. చెరువును సందర్శించి చెరువు ప్రకృతి అందాలను అభివర్ణించారు. చెరువును చూస్తే తనకు ఎంతో ఆనందంగా ఉందని కంభం చెరువును మంచి పర్యాటక ప్రదేశంగా రూ.35 కోట్ల వరకు ఖర్చు చేసి తీర్చిదిద్దుతామని అన్నారు. అవసరమైతే ఇంకా అదనంగా ఖర్చు చేస్తామని బాలాజీ తెలిపారు.