ATP: శెట్టూరు మండలం యాటకల్లు గ్రామంలో బుధవారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో గ్యాస్ సిలిండర్ పేలింది. ఈ ఘటనలో హోటల్ బంకు దగ్ధమైంది. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. బాధితులకు తన తరఫున రూ.10వేల ఆర్థిక సాయం అందజేశారు. డీఎస్పీతో మాట్లాడి బాధితులకు న్యాయం చేయాలని ఆదేశించారు.