VZM: ఉత్తరాంధ్ర సుజల శ్రవంతి ప్రాజెక్ట్‌కు సంబంధించిన భూ సేకరణ వేగంగా జరగాలని కలెక్టర్ రాంసుందర్ రెడ్డి ఆదేశించారు. శుక్రవారం కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో భూసేకరణపై రెవిన్యూ, ఇరిగేషన్ అధికారులతో ఆయన సమీక్షించారు. సుజల శ్రవంతి ప్రాజెక్ట్‌కు సేకరిస్తున్న భూమి గ్రామం వారీగా, సర్వే నెంబర్ వారీగా ప్రభుత్వ భూమి, డీ పట్టా, అసైన్డ్ భూమి వివరాలను సమర్పించాలన్నారు.