కోనసీమ: భూముల పునః సర్వే ప్రక్రియను వేగవంతం చేసి మార్చి నెలాఖరుకి గ్రౌండ్ వర్క్ పూర్తి చేయాలని కలెక్టర్ మహేశ్ కుమార్ రెవెన్యూ, సర్వే సిబ్బందిని ఆదేశించారు. బుధవారం అమరావతి నుంచి రాష్ట్ర భూ పరిపాలన ముఖ్య కమిషనర్ జయలక్ష్మి, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ డైరెక్టర్ ప్రభాకరరెడ్డి వివిధ జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ సమావేశం నిర్వహించారు.