SKLM జలుమూరు కేజీబీవీ పాఠశాలలో వన్ స్టాప్ సెంటర్ ఆధ్వర్యంలో శుక్రవారం “ఆడపిల్లలను చదివిద్దాం-రక్షిద్దాం” అనే అంశంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన నరసన్నపేట టీడీపీ నియోజకవర్గ సమన్వయకర్త బగ్గు అర్చన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. బాలికల చదువుతోనే సాధికారత సాధించగలరని, ఆత్మవిశ్వాసంతో లక్ష్యాల దిశగా సాగాలని సూచించారు.