విశాఖ: ఆంధ్ర విశ్వవిద్యాలయంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జీవితం ఆధారంగా ‘అగ్ని సరస్సులో వికసించిన కమలం’ పుస్తకాన్ని రోడ్లు శుభ్రం చేసే కార్మికురాలు లక్ష్మమ్మ గురువారం ఆవిష్కరించారు. దీనికి రచయిత ప్రొఫెసర్ యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ కాగా శ్రమ గౌరవం, సామాజిక సమానత్వానికి ప్రతీకగా ఈ కార్యక్రమం నిలిచింది.