NDL: బనగానపల్లె మాజీ MLA కాటసాని రామిరెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. 2025 నూతన సంవత్సర వేడుకలకు దూరంగా ఉంటున్నట్లు ప్రకటించారు. న్యూ ఇయర్ వేడుకలకు YCP పార్టీ శ్రేణులకు తాను అందుబాటులో ఉండటం లేదని కాటసాని స్పష్టం చేశారు. గ్రామాల్లో ప్రశాంతంగా వేడుకలు జరుపుకోవాలని పిలుపునిచ్చారు. ప్రజలు, రైతులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.