బాపట్ల: పురపాలక సంఘ పరిధిలో వీధి కుక్కల నియంత్రణకు అధికారులు చర్యలు చేపట్టారు. బాపట్ల మున్సిపల్ కమిషనర్ రఘునాథరెడ్డి ఆదేశాల మేరకు.. వీధి కుక్కలను పట్టుకొని సంతాన ఉత్పత్తి నియంత్రణ చర్యలలో భాగంగా పట్టణంలోని వివిధ వార్డులలో ఆదివారం వీధి కుక్కలను సంతాన నియంత్రణ(sterilization) కేంద్రానికి తరలించారు. దీంతో పట్టణ ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.