GNTR: పెదకాకానికు చెందిన సత్యనారాయణ, అనూష దంపతులు గృహాన్ని అమ్ముతున్నట్లు చెప్పి, అదే ప్రాంతానికి చెందిన వాసుదేవ్ వద్ద నుంచి రూ.15 లక్షలు అడ్వాన్స్‌గా తీసుకున్నారు. మొత్తం రూ.33 లక్షలకు ఒప్పందం కాగా, బ్యాంక్‌లోన్ కోసం ఫిర్యాదుదారుడు అవసరమైన సర్వే సర్టిఫికేట్ కోరగా, వారు పంపిన సర్టిఫికేట్, బుధవారం MRO విచారణలో నకిలీగా తేలింది.