KDP: దేవుడు అందరికీ మంచి చేసి సమృద్ధిగా అభివృద్ధి చెందాలని కడప ఎమ్మెల్యే మాధవి రెడ్డి ఆకాంక్షించారు. కడపలోని సీఎస్ఐ చర్చ్‌లో జరిగిన సెమీ క్రిస్మస్ వేడుకల్లో జిల్లా టీడీపీ అధ్యక్షుడు శ్రీనివాసులరెడ్డితో కలిసి ఎమ్మెల్యే పాల్గొన్నారు. ప్రతి క్రైస్తవ సోదరుడికి క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి ఒక్కరు సుఖ సంతోషాలతో క్రిస్మస్ జరుపుకోవాలని ఆకాంక్షించారు.