W.G: భీమడోలు మండలం గుండుగోలను కుండీల పేట శివారులో ఆదివారం జరుగుతున్న కోడిపందాలపై ఎస్ఐ సుధాకర్ తన సిబ్బందితో మెరుగు దాడి చేశారు. ఈ సందర్భంగా ఎస్ఐఐ మాట్లాడుతూ.. ఈ దాడిలో 7 ద్విచక్ర వాహనాలు, 9 మంది వ్యక్తులను అదుపులోకి తీసుకున్నామన్నారు. అలాగే 1 కోడిపుంజు, 2 కోడి కత్తులు, రూ.3500 నగదు స్వాధీన పరుచుకున్నామన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.