CTR: గిరింపేటలోని సావిత్రమ్మ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో రూ.70 లక్షలతో బీసీ హాస్టల్ భవన నిర్మాణం చేపట్టనున్నారు. కలెక్టర్ సుమిత్ కుమార్, పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్ గురువారం భూమి పూజ చేశారు. P4లో భాగంగా కలెక్టర్ రూ.30 లక్షలు మంజూరు చేయించారు. మాజీ ఎమ్మెల్యే వెంకటేశ్వర చౌదరి, విజయం కళాశాల అధినేత తేజోమూర్తి రూ.40 లక్షలు సాయం చేశారు.