NZB : ప్రభుత్వం సబ్సిడీపై అందజేస్తున్న వ్యవసాయ పనిముట్లకు రైతులు దరఖాస్తు చేసుకోవాలని ఎడపల్లి మండల వ్యవసాయ శాఖ అధికారి సిద్ధిరామేశ్వర్ తెలిపారు. పథకంలో భాగంగా చేతి పంపులు, పవర్ స్ప్రేయర్స్, రోటోవేటర్లు, పవర్ టిల్లర్లు వంటి 14 రకాల పనిముట్లను 40-50 శాతం రాయితీపై పొందవచ్చున్నారు. దరఖాస్తు ఫారం,పాస్ పోర్టు ఫోటోతో ఈనెల 31వ తేదీ లోపు రైతు వేదికలో అందజేయాలన్నారు.