కోనసీమ: అమలాపురంలో ట్రాఫిక్ సమస్యపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌కు అమలాపురం ఎమ్మెల్యే అయితా బత్తుల ఆనందరావు వివరించారు. ఇందులో భాగంగా సమావేశాల అనంతరం సచివాలయంలో పవన్ కళ్యాణ్‌ను కలిసి ట్రాఫిక్ సమస్య నియంత్రణకు ఇప్పటికే రెండు వంతెనలు నిర్మించడం జరిగిందని, ఇంకా 6 వంతెనలు నిర్మించాల్సిన అవసరం ఉందని, వెంటనే బ్రిడ్జిల నిర్మాణం కొరకు నిధులు మంజూరు చేయాలని కోరారు.