ప్రకాశం: మార్కాపురం సీనియర్ సివిల్ జడ్జి కోర్ట్ అడిషనల్ గవర్నమెంట్ ప్లీడర్ (AGP)గా తర్లుపాడుకు చెందిన లాయర్ వనపర్తి నాగేంద్ర రాజు నియమితులయ్యారు. ఈ మేరకు శుక్రవారం ఆయన బాధ్యతలు చేపట్టారు. ప్రభుత్వానికి సంబంధించిన సివిల్ కేసుల్లో న్యాయ సలహాలు ఇవ్వడంతో పాటు.. ప్రభుత్వం తరఫున కోర్టులో వాదనలు వినిపించునున్నారు. మూడేళ్ల పాటు ఆయన ఈ పదవిలో కొనసాగుతారు.