CTR: రొంపిచర్ల కేజీబీవీ విద్యార్థిని స్రవంతి ఏపి సన్షైన్ అవార్డుకు ఎంపికైనట్లు ప్రిన్సిపల్ సుజాత తెలిపారు. కేజీబీవీలో ఇంటర్ సెకండియర్ చదువుతున్న స్రవంతి సీఈసీ గ్రూపులో 935 మార్కులతో అగ్రస్థానంలో నిలిచినందుకు అవార్డుకు ఎంపికైందన్నారు. స్రవంతి ప్రతిభను గుర్తించి ఏప్రిల్ 15వ తేదీ విద్యామంత్రి నారా లోకేశ్ అవార్డు అందజేస్తారని తెలిపారు.