GNTR: గుంటూరులోని తక్కెళ్లపాడు రోడ్డులో సోమవారం ఓ వృద్దురాలు దీనస్థితిలో పడి ఉండటం స్థానికులను కలిచివేసింది. గుర్తుతెలియని వ్యక్తులు వృద్దురాలిని వదిలి పెట్టి వెళ్లడంతో స్థానికులు పాతగుంటూరు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో గుంటూరు కోవిడ్ ఫైటర్స్ టీమ్ ఆ వృద్దురాలికి సపర్యలు చేసి పొన్నూరు గోతాలస్వామి ఆశ్రమంలో చేర్పించి మానవత్వం చాటుకున్నారు.