NLR: కోవూరు మండలంలో చెరువు కట్ట కలుజులు దగ్గర ఉన్న కాలనీలో 70 కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. గత ఐదు రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాల కారణంగా వరద నీరు ఇళ్లల్లోకి రావడంతో స్థానికులు ఇబ్బంది పడ్డారు. విషయం తెలిసిన వెంటనే వేమిరెడ్డి స్వయంగా ఘటనా స్థలాన్ని చేరుకుని వరద బాధితులను పరామర్శించారు. బాధితులందరికీ తక్షణమే సహాయం చేస్తామని భరోసా ఇచ్చారు.